తెలంగాణలో 4 జిల్లాలకు జాతీయ స్వచ్ఛ పురస్కారాలు

-

తెలంగాణలోని పల్లెలలకు మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలు జాతీయ పురస్కారాలు అందుకున్న పల్లెలు మరోసారి ఆ అవార్డులకు ఎంపికయ్యాయి. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ జూన్‌ నెలకు ప్రకటించిన జాతీయ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారాలకు నాలుగు తెలంగాణ జిల్లాలు ఎంపికయ్యాయి. మొత్తం 12 పురస్కారాలను కేంద్రం ప్రకటించగా.. తెలంగాణ రాష్ట్రం అందులో మూడో వంతు దక్కించుకుంది.

అచీవర్స్‌ కేటగిరీలో హనుమకొండ, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలు 300 మార్కులతో రెండు, మూడోస్థానాల్లో నిలిచాయి. ఇదే కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచిన  సిక్కిం రాష్ట్రానికి చెందిన గ్యాల్‌షింగ్‌ జిల్లాకు సైతం 300 మార్కులే లభించాయి. జనాభా, ఇతర అంశాల ప్రాతిపదికన ఆ జిల్లాకు ప్రథమ స్థానం… హనుమకొండ, కుమురం భీమ్‌ జిల్లాలకు తర్వాత స్థానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హై అచీవర్స్‌ విభాగంలో జనగామ, కామారెడ్డి జిల్లాలు 300 వందల మార్కులతో రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. ఈ కేటగిరీలో మొదటిస్థానం పొందిన మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అలిరాజ్‌పుర్‌ దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version