వివాదంలో స్వామీజీ ! గ్యాప్ వ‌చ్చిందా ? తీసుకున్నారా ?

-

త్రిదండి చిన‌జియ‌రు స్వామి కొత్త వివాదంలో ఇరుక్కున్నారు.ఆయ‌న ఏ ముహూర్తాన స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ పేరిట ఉత్స‌వాలు నిర్వ‌హించారో అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు కొత్త క‌ష్టాలు ఆరంభం అయ్యాయి.కేసీఆర్ తో ఆయ‌న అస్స‌లు ప‌డ‌డం లేదు. పైకి మాకు రాజ‌కీయాలు అవ‌స‌రం లేదు.మాకు అంద‌రూ స‌మాన‌మే అని చెప్పే స్వామిజీ లోప‌ల మాత్రం ఏనాటి నుంచో కేసీఆర్ కు ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు అన్న‌ది ఓ వాస్త‌వం.కానీ బీజేపీకి కేసీఆర్ కు మ‌ధ్య బంధాలు చెడిన నేప‌థ్యంలో స్వామీజీ ఇరుక్కుపోయారు అన్న‌ది మ‌రో వాస్త‌వం.దీంతో ఏం చేయాలో తోచ‌క ఆయ‌న స‌త‌మ‌తం అవుతున్నారు.

ఏనాటి నుంచో రాజ‌కీయాల‌కు, మ‌ఠాధిప‌తుల‌కు ఉన్న అనుబంధం ఇప్పుడిలా బెడిసికొట్ట‌డంతో సంబంధిత వ‌ర్గాలు తీవ్ర క‌ల‌వ‌రానికి లోన‌వుతున్నాయి. వాస్త‌వానికి కేసీఆర్ కానీ బీజేపీ వ‌ర్గాలు కానీ స్వామీజీకి స‌మ ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తున్నాయి. కానీ ఆ రోజు మోడీ వ‌చ్చాక కేసీఆర్ మాత్రం ఎందుక‌నో ఇక్క‌డికి రాలేదు.ముచ్చింత‌ల్ వేడుక‌ల్లో మోడీ ప‌క్క‌న కూర్చొని పాల్గొనాల్సి ఉన్నా జ్వ‌రం కార‌ణంగా ఇంటికే ప‌రిమితం అయ్యారు.

ఇదంతా రాజ‌కీయంలో భాగ‌మేన‌ని ఈ విష‌య‌మై కేసీఆర్ ను కొంచెం కూడా అనుమానించాల్సిన ప‌నే లేద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. చాలా రోజుల నుంచి కేసీఆర్ కు అతి ద‌గ్గ‌ర‌గా ఉండే మై హోం సంస్థ పెద్ద‌లే ఈ  ఆశ్ర‌మాన్ని నిర్మించాని,ఇందుకు కేసీఆర్ ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని, తెలంగాణ రాష్ట్ర స‌మితి శ్రేణులే కాదు సీమ‌కు చెందిన చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి లాంటి నేత‌లు కూడా ఈ మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి లేదా నిర్మాణానికి త‌మవంతు ఆర్థిక సాయం చేశారు అన్న‌ది నిర్వివాదం. కానీ త‌రువాత ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ త‌నని తాను ఒక జాతీయ స్థాయి నేత‌గా ప్ర‌మోట్ చేసుకునే క్ర‌మంలో బీజేపీతో వైరం పెంచుకున్నారు.ఇంకా చెప్పాలంటే కోరి క‌య్యం తెచ్చుకున్నారు.

ఇదే ఇప్పుడు స్వామీజీ కి కూడా కొత్త త‌ల‌నొప్పులు తెచ్చి పెడుతోంది. తెలంగాణ‌కు మ‌కుటాయ‌మానంగా నిలిచిన ముచ్చింత‌ల్ ఆశ్ర‌మం అన్న‌ది ప‌ర్యాట‌కం ప‌రంగా కూడా ఓ పెద్ద ఆక‌ర్ష‌ణ. ఆ రోజు ఈనాడు గ్రూపు సంస్థ‌లు నిర్మించాల‌నుకున్న ఓం సిటీ క‌న్నా ఈ ఆశ్ర‌మం స్థాయి పెద్ద‌ది కూడా! ఇంకా చెప్పాలంటే రాజ‌కీయంగా కూడా ఇరు రాష్ట్రాల‌కూ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన ఆశ్ర‌మం కూడా!

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ కొత్త ఎత్తుగ‌డ వేశారు.త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న యాదాద్రి ఆల‌య పునః ప్రారంభోత్స‌వాల‌కు చిన జియ‌రు స్వామికి ఆహ్వానం పంప‌లేదు. ఈ నెల 21 నుంచి 28 వ‌ర‌కూ జ‌రిగే మ‌హా కుంభ సంప్రోక్ష‌ణ పూజ‌ల్లో భాగంగా బాలాల‌యంలోని ఆంత‌రంగికంగా పంచ‌కుండాత్మ‌క మ‌హా సుద‌ర్శ‌న యాగం నిర్వ‌హించనున్నామ‌ని యాదాద్రి క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు.అయితే ఆహ్వానితుల్లో మాత్రం జియ‌రు స్వామి పేరు లేదు. అంటే కేసీఆర్ వ్యూహాత్మ‌కంగానే స్వామీజీని ప‌క్క‌న‌బెడుతున్నార‌న్న‌ది సుస్ప‌ష్టం.

Read more RELATED
Recommended to you

Exit mobile version