తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే… రైతులు, సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కోతలు, నీటి సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు మాత్రం అష్ట కష్టాలు పడుతున్నారు. ఇక ఇదే తరహాలో సిరిసిల్ల నేతన్నల పరిస్థితి అలాగే ఉంది.
గత పది సంవత్సరాలుగా సిరిసిల్లగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఉరిసిల్లగా మారుతుంది. బతుకమ్మ చీరలు ఆర్డర్ లేక… నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉపాధి లేక సిరిసిల్ల నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు.
తడక శ్రీనివాస్ (42) అనే నేత కార్మికుడు గత రెండు నెలల నుండి సరైన ఉపాధి లేక తన ఆరోగ్యానికి మందులు కూడా కొనలేని పరిస్థితిలోఆర్థిక ఇబ్బందులతో నిన్న రాత్రి సిరిసిల్లలోని బి.వై. నగర్లో తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.