హన్మకొండ NSR ఆస్పత్రిలో ఠాగూర్ సీన్ రిపీట్.. కాలు విగిరిందని వెళ్తే..!

-

ప్రైవేట్ హాస్పిటల్స్ సామాన్యుల పాలిట యమపాశంగా తయారయ్యాయి. మెరుగైన చికిత్స దొరుకుతుందని ప్రభుత్వం దవాఖానాలను కాదని వెళ్లిన వారికి ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు నరకం చూపిస్తున్నాయి. లేని వ్యాధులు ఉన్నట్లుగా చిత్రీకరించి జేబులు గుల్ల చేస్తున్నారు. దీనికి తోడు టెస్టుల పేరిట సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే కాలు విరిగిందని చికిత్స కోసం వెళితే ఏకంగా రోగి ప్రాణాలు పోవడంతో పాటు చికిత్స పేరుతో డబ్బులు గుంజె ప్రయత్నం చేశారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ మూవీలోని హాస్పిటల్ సీన్ ఎంత ఫేమసో అందరికీ తెలుసు. సేమ్ సీన్ హన్మకొండ‌లోని ఎస్ఆర్ఆర్ హాస్పిటల్‌లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..హన్మకొండలోని ముచ్చర్ల నాగారంకు చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో చికిత్స కోసం అతను ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో చేరాడు.ఆస్పత్రిలోని వైద్యులు కాలుకు చేసిన సర్జరీ ఫెయిల్ అవ్వడంతో మళ్లీ సర్జరీ నిర్వహించారు. అది కూడా ఫెయిల్ అయ్యింది. అయితే, కాలు సర్జరీ కోసం వెళ్లిన హరిప్రసాద్ పలుమార్లు సర్జరీ ఫెయిల్ కావడం వల్లే చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

దీనికి తోడు హరిప్రసాద్ చనిపోయిన విషయం చెప్పకుండా డబ్బుల కోసం ఇంకా సర్జరీ చేస్తున్నామని వైద్యులు నమ్మించారని, ఆస్పత్రి దగ్గర భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news