Saripodhaa Sanivaaram : సరిపోదా శనివారంతో నానికి హిట్ వచ్చేసిందా..? కథ, రివ్యూ & రేటింగ్..!

-

Saripodhaa Sanivaaram : నాని హీరోగా వచ్చిన సరిపోదా శనివారం ఈరోజు రిలీజ్ అయింది. ఇదివరకు క్లాస్, సెన్సిబిల్ సినిమాలు తీసిన వివేక్ ఆత్రేయ ఈ మూవీతో హిట్టు కొట్టేసారా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మూవీ కథ విషయానికే వచ్చేస్తే.. చిన్ను అలియాస్ సూర్య (నాని) విపరీతమైన కోపంతో ఉంటాడు. ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి తల్లి ఛాయాదేవి (అభిరామి) కండిషన్ పెడుతుంది. వారమంతా కాకుండా ఒక రోజు కోపాన్ని చూపించమని చెప్తుంది కోపం అంటే ఏంటో చెప్పాలని ఛాయాదేవి అడుగుతుంది. అంతలోపే ఆమె చనిపోతుంది. శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించాలని సూర్య ఫిక్స్ అయిపోతాడు. సోకులపాలెంలో ఎస్సై దయానంద తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు.

కోపంతో ఊగిపోతూ ఎవరో ఒకరిని హింసిస్తాడు. దయానంద్ కి తన అన్న ఎమ్మెల్యే కూర్మానందం తో ల్యాండ్ సమస్యలు వస్తాయి. కూర్మానంద్ ని చంపాలని దయానంద్ ప్లాన్ చేస్తాడు. సూర్యని సోకులపాలెంకు కానిస్టేబుల్ చారులత తీసుకువచ్చి ఏం చేస్తుంది..? సోకులపాలం కోసం సూర్య నిలబడ్డాక ఏమవుతుంది..? దయానంద్ సూర్య మధ్య అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి. తన తండ్రి కోపాన్ని అదుపు చేయాలని మొదటి చూడడం, చివరలో మళ్లీ ఆ తండ్రి మారిపోయి ఆయుధాన్ని ఇచ్చి విలన్ మీదకు పంపడం అన్ని సినిమాల్లో సాధారణమే.

ఈ సినిమాలో కూడా అంతే. ఈ మూవీలో ఏ మాత్రం కొత్తగా అనిపించే సీన్ లేకపోవడం మూవీకి మైనస్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా ఆడియన్స్ మైండ్ ను ట్యూన్ చేసే విధంగా వాడుకున్నట్లు అనిపిస్తుంది. హీరో బాల్యంలో సీన్స్ తల్లి చెప్పే విషయాలు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వీటన్నిటితో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండ్ హాఫ్ లో హీరో విలన్ మధ్య ఆట అంతా ఇంట్రెస్టింగ్ గా ఏం ఉండదు. డైలాగ్లు కొన్ని చోట్ల బాగున్నాయి. టెక్నికల్ టీం ని కూడా బాగా వాడుకున్నారు. నాని, సూర్య గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో సాయికుమార్ కి కూడా మంచి పాత్ర పడింది.

Rating: 2.75/5

Read more RELATED
Recommended to you

Latest news