హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో..అక్రమ కట్టాలపై తలసాని కీలక ప్రకటన చేశారు. హుస్సెన్ సాగర్ నీటిమట్టాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించారు మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… నగరంలో వర్షాలకు ఎలాంటి ప్రాణా , ఆస్థి నష్టం లేకుండా చూస్తున్నామని.. అన్ని శాఖలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.
నాలాల అంభివృద్ధి చేశాం … చాల ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పాయని వివరించారు. హుస్సేన్ సాగర్ లో 2 వేల క్యూసెక్కులు కిందకు వదులుతున్నామని..నాలాల దగ్గర ఆక్రమ నిర్మాణాలతో కొన్ని ఇబ్బందులు అయ్యాయని వివరించారు.ఆక్రమ నిర్మాణాలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని.. అవసరమైతే వారికి నష్టపరిహారం కూడా ఇస్తామన్నారు. రానున్న వారం పాటు వర్షాలు ఉన్నాయనే సమాచారం ఉందని చెప్పారు. వారం పాటు అన్నిశాఖల అధికారు లు అప్రమత్తంగా ఉండాలని..ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా జీహెచ్ఎంసీ కి కంట్రోల్ రూమ్ కు పిర్యాదు చేయండని కోరారు.