రహానే ఇలాగే ఆడితే యంగ్ ప్లేయర్ల నుండి ముప్పు తప్పదు: వసీం జాఫర్ !

-

ఐపీఎల్ కు ముందు జరిగిన టెస్ట్ సిరీస్ లలో ఘోరంగా ఆడి జట్టులో స్థానం కోల్పోయాడు అజింక్య రహానే. కానీ ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ లో చెన్నై తరపున దూకుడైన ఆటతీరుతో మళ్ళీ వెస్ట్ ఇండీస్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపికయ్యాడు. కానీ ఇప్పటి వరకు రెండు టెస్ట్ లలో కలిపి రెండు ఇన్నింగ్స్ లు ఆడిన రహానే కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. రహానే ప్రదర్శనపై మాజీ ఇండియా క్రికెటర్ వసీం జాపేర్ మాట్లాడుతూ రహానే ఫామ్ లోనే ఉన్నాడు. కానీ నిలకడగా పరుగులు సాధించడంలో విఫలం అవుతున్నాడని చెప్పారు. ముందు ముందు టెస్ట్ లలో స్థానం నిలుపుకోవాలంటే నిలక్షగా ఆడుతూ పరుగులు చేయాల్సి ఉందన్నాడు. అలా ఆడకుంటే ఇప్పుడు యంగ్ క్రికెటర్ల నుండి ముప్పు తప్పదు అంటూ అజింక్య రహానేకు సూచించాడు.

ఇప్పుడు ఇండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ అయ్యే అన్ని అంశాలు రహానెలో ఉన్నాయన్నారు. మరి రహానే రెండవ ఇన్నిన్స్ ఆడే ఆవకాశం వస్తే కనీసం అర్ద సెంచరీ అయినా చేస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version