మునుగోడు వరకే మా మద్దతు ఉంటుంది – తమ్మినేని వీరభద్రం

-

మునుగోడు ఎన్నిక విషయంలో కాంగ్రెస్, టీఆరెస్ నుండీ మద్దతు కావాలని విజ్ఞప్తులు వచ్చాయి..మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మునుగోడు లో బీజేపీ ఓడించడానికి టీఆరెస్ కి మద్దతు ఇస్తున్నామన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా అన్నారు..టీఆరెస్ నియోజకవర్గ నికి అన్యాయం చేస్తే కాంగ్రెస్ కి ఎందుకు రాజీనామా చేశారు..మునుగోడు సభ లో అమిత్షా బీజేపీ ని గెలిపించండి గెలిపించిన నెల రోజుల్లో టీఆరెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బహిరంగంగా చెప్పారని ఫైర్ అయ్యారు.

పూర్తి మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని నెల రోజుల్లో ఎలా పడగొడతారు..ఎమ్మెల్యేలను కొనేయడం,ఈడీ తో బెదిరింపులు చేయడం..రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ vs కాంగ్రెస్ మరే అవకాశం ఉంది.. దానిని టీఆరెస్ vs బీజేపీ గా మార్చాలని బీజేపీ ప్లాన్..చేస్తోందన్నారు.

బలమున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మూడవ ప్లేస్ కి వెళ్లే పరిస్థితి వచ్చింది..మునుగోడు ఎన్నికల ఫలితం ఎలా వచ్చిన టీఆరెస్ వ్యతిరేక శక్తులు బీజేపీ లో చేరేలా ప్లాన్ చేసారా.. రాజకీయాలను వక్రమార్గం లో దేశాన్నిన్ని మతతత్వ రాజకీయాలు చేస్తుందని ఫైర్ అయ్యారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. .సీపీఐ లాగా మేము దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోలేదు..మునుగోడు వరకే మా మద్దతు ఉంటుంది.. కేసీఆర్.. బీజేపీ కి వ్యతిరేకంగా చేస్తున్న రాజకీయాలు స్వాగతిస్తున్నామన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version