మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదం… కొద్దిసేపటికి క్రితమే చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లాలో వాటర్ ట్యాంకర్, బైక్ ఢీ కొని నలుగురు మృతి చెందారు.
మనోహరాబాద్ మండలం పోతారం దగ్గర ఈ ఘటన జరిగింది. పోతారం దగ్గర రోడ్డుపైన రైతులు ధాన్యం ఆరబోశారు. అయితే ధాన్యం కుప్పలు ఉండటంతో.. ఒకవైపు నుంచే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని గమనించకపోవడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చి బైక్ను వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు.