కడియం శ్రీహరి పై స్టేషన్ ఘనపూర్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి తల్లి పద్మశాలి కులానికి చెందిన వ్యక్తి… తల్లి అనేది నిజం తండ్రి అనేది ఊహ అంటూ హాట్ కామెంట్స్ చేశారు తాటికొండ రాజయ్య.
అంటే కడియం శ్రీహరి తండ్రి నీ ఉద్దేశించి… ఆయనను అవమానించేలా మాట్లాడారు రాజయ్య. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కులం పేరుతోనూ కడియం అక్రమంగా రిజర్వేషన్‌ను పొందారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు దుర్వినియోగానికి పాల్పడి ఆస్తులు కూడబెట్టుకున్నారని అన్నారు. కడియం శ్రీహరి పెద్ద అవినీతి తిమింగలం అంటూ మండిపడ్డారు. ఘణపురం గడ్డ నాదే…. అడ్డ నాదే అంటూ ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర స్థాయిలో కడియంపై విరుచుకుపడ్డారు.
కడియం శ్రీహరి తల్లి పద్మశాలి బీసీ. తల్లి అనేది నిజం, తండ్రి అనేది ఊహ – స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య pic.twitter.com/fkBeAvQAou
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2023