టీడీపీ జీవీఎంసీ మేయర్ అభ్యర్థి ఖరారు అయ్యారు. పీలా శ్రీనివాసరావును మేయర్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఆయనకు సీనియర్ నేత గండి బాల్జీ (Gandi Babji) బీఫామ్ అందజేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మేయర్ను ఎన్నుకోనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవీఎంసీపై ఫోకస్ పెట్టింది. వైసీపీ కార్పొరేటర్ గొలగాని హరి వెంకట కుమారి మేయర్ గా అవిశ్వాసంలో పదవిని కోల్పోయారు.
పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేన లోకి చేరిపోవడం, మెజార్టీ సభ్యులు ఆమెపై అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం, ఈ నెల 19న ఓటింగ్ జరగడం, అవిశ్వాసం నెగ్గడం చకాచకా జరిగిపోయాయి. దీంతో
మేయర్, డిప్యూటీ మేయర్ను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ప్రకటించారు. సోమవారం ఉదయం జీవీఎంసీ కార్పొరేషన్ కౌన్సిల్లో మేయర్ ని సభ్యులు ఎన్నుకోనున్నారు.