తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తెలంగాణ మరింత ఉష్ణోగ్రతలు పెరుగనున్నాయి. తెలంగాణలో గత కొన్ని రోజులుగా వరుణుడి జాడ కనిపించడం లేదు. ఈసారి నైరుతి రుతుపవనాల రాకే ఆలస్యం కాగా, జూన్ నెలలో సరిగ్గా వర్షాలు కురవలేదు. దీంతో ఆ నెల లోటు వర్షపాతం నమోదయింది. ఇక జూలై చివరి వారంలో వర్షాలు దంచి కొట్టాయి.
తెలంగాణ రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీ వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు. జూలై నెలలో రికార్డు వర్షపాతం నమోదయింది. ఇక ఆగస్టు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేడి గాలులు, విపరీతమైన ఉక్కపోత ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. వర్షాలు లేక అన్నదాతలు తలలు పట్టుకుం టున్నారు. అయితే… మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.