తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మటన్ ముక్క తిని ప్రాణాలు వదిలాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నిజామాబాద్ జిల్లా బొప్పాసలో మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మరణించాడు. బంధువుల పెళ్లి నేపథ్యంలో… మృతుడు మటన్ తో బాగానే ఆరగించాడు.

అయితే.. జనాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో… కాస్త తొందరగా భోజనం చేశాడు. ఇంకేముంది గొంతులో మటన్ ఒక ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడక గొంతులో.. ముక్క ఉండటం కారణంగా… అక్కడికక్కడే మరణించాడు నిజామాబాద్ జిల్లా వాసి. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇలా మటన్ ముక్కలు గొంతులో ఇరుక్కుని చనిపోవడం కొత్తేమీ కాదు. చాలాసార్లు జరిగాయి. అయినప్పటికీ చాలామంది ఇలా.. తప్పిదాలు చేసి మరణిస్తున్నారు.
వ్యక్తి ప్రాణం తీసిన మటన్ ముక్క
నిజామాబాద్ జిల్లా బొప్పాసలో మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
బంధువుల పెళ్లిలో మటన్ తింటుండగా గొంతులో ముక్క ఇరుక్కొని మృతి