గన్ పార్క్ ఇనుపకంచెల వల్ల గాయపడ్డ తెలంగాణ ఉద్యమ కారుడు !

-

గన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఇనుపకంచెల వల్ల తెలంగాణ ఉద్యమ కారుడు గాయపడ్డాడు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు భారీగా తరలివచ్చారు జనం. అయితే… అనూహ్యంగా బారికేడ్ మీద పడటంతో తెలంగాణ ఉద్యమ కారుడు తిరుమనందాస్ నరేష్ కాలికి తీవ్ర గాయం అయింది. అనంతరం అపోలో హాస్పిటల్ కు తెలంగాణ ఉద్యమ కారుడు తిరుమనందాస్ నరేష్ తరలించి… చికిత్స అందిస్తున్నారు.

Telangana activist injured by gun park iron fences

అయితే..కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించగానే ఇనుప కంచె తొలగించారు పోలీసులు. కాగా,బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్దకు చేరుకుని క్యాండిల్‌ ర్యాలీని ప్రారంభించారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్‌ ర్యాలీ కొనసాగింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version