శాసనసభ ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. గురువారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు శాఖ పోలింగ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 144వ సెక్షన్‌ను విధించారు . 28 సాయంత్రం 5గంటల నుంచి 30 ఉదయం 6గంటల వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. 45వేల రాష్ట్ర పోలీసులు..3వేలు ఇతర శాఖలకు చెందిన రక్షకభటులు, 50 కంపెనీల ప్రత్యేక పోలీసులు, 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు . వీళ్లకు అదనంగా కర్నాటక, మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా నుంచి 23 వేల హోంగార్డులు సైతం ఎన్నికల్లో సేవలందించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి అధికారులు పోలింగ్​ కేంద్రాలను పర్యవేక్షించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news