తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చించనుంది ప్రభుత్వం.
ఇక ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలోనే… కేసీఆర్ హజరు కావడంపై అందరి దృష్టి నెలకొంది. కేసీఆర్ హజరు అవుతే.. సినిమా వేరేలాగా ఉంటుందని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
ఇది ఇలా ఉండగా..తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు కానున్నట్లు ప్రకటించారు. రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు నిర్ణయిస్తామని వెల్లడించారు. మారు వేషాల్లో మారీచుడు, సుబాహువుల్లా బీఆర్ఎస్, బీజేపీ నేతలు మీ వద్దకు వస్తారని.. వారు చెప్పేవి నమ్మకండి, వినకండి అని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.