నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే.. తెలంగాణ నూతన శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రతిపాదించింది. ఇవాళ ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు.
ఆ తర్వాత శాసనసభలో ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. అక్బరుద్దీన్ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఎక్కువ సార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారన్న విషయం తెలిసిందే. అలా చూసుకుంటే ప్రస్తుతం అత్యధికంగా ఎనిమిది సార్లు ఎన్నికైన శాసన సభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్కు చెందిన నేతలు కూడా ఉన్నారు. అయినా తాజాగా అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నిక చేశారు.