తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒక రోజు పొడిగించారు. దీంతో వర్షాకాల సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. రేపు తొమ్మిదేళ్ళ తెలంగాణ సాధించిన ప్రగతి పై లఘు చర్చ జరుగనుంది. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ మాట్లాడనున్నారు. ఇక ఈ రోజు ఉదయం 10 గంటలకు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
మొదట ప్రశ్నోత్తరాలు, జీరో హవర్ ఉండనుండగా…. అనంతరం రెండు అంశాల పై అసెంబ్లీలో లఘు చర్చ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తీసుకున్న చర్యల పై స్వల్ప కాలిక చర్చ జరుగనుంది. అనంతరం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పై లఘు చర్చ జరుగనుంది. ఇక ఈ రోజు సభలో మూడు బిల్లుల పై చర్చించి ఆమోదించనుంది అసెంబ్లీ. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2023 బిల్లు, తెలంగాణ స్టేట్ ఫ్యాక్టరీస్ 2023 బిల్లు, మైనార్టీస్ కార్పొరేషన్ బిల్లులకు ఆమోదం ముద్ర పడనుంది.