రేపు తెలంగాణ బంద్ కార్యక్రమం ఉండనుంది. చతిస్గడ్ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లోని గచ్చిబౌలిలో జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ రేపు తెలంగాణ బందుకు పిలుపునిచ్చింది. ఆదివారం రోజు జరిగిన ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
వీరిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ అధినేత మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ్వ కూడా ఉంది. కాబోయే 21 లక్షల రివార్డు ఉంది. అయితే వీరి ఈ మృతి నేపథ్యంలో తెలంగాణ బందుకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కాగా ఈ బందులో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని మావోయిస్టు పార్టీ కోరింది. ఈ మేరకు లెటర్ కూడా విడుదల చేసింది.