తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు నెలల కాలంలో ఎన్నికలు రానున్నాయి. సీఎంగా ఉన్న కేసీఆర్ మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అయితే ఈసారి కేసీఆర్ కు గెలవడం అంత ఈజీ కాదన్నా విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది. BRS కు గట్టి పోటీ ఇవ్వడానికి అన్ని ఆయుధాలతో కాంగ్రెస్ మరియు బీజేపీలు సిద్ధంగా ఉన్నారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ ఎన్నికలలో పాల్గొనే జాబితాను కాసేపటి క్రితమే విడుదల చేసింది.. అయితే కేవలం 38 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.
అలా చూస్తే… కిషన్ రెడ్డి – అంబర్ పేట, విజయలక్ష్మి – ముషీరాబాద్, మర్రిశశిధర్ – సనత్ నగర్, ప్రభాకర్ – ఉప్పల్, రామచంద్రరావు – మల్కాజ్ గిరి, చింతల రామచంద్రారెడ్డి – ఖైరతాబాద్ , విక్రమ్ గౌడ్ – గోషామహల్, శ్రీరాములు – మహేశ్వరం, థల్లోజు – కల్వకుర్తి, అరుణ – గద్వాల, జితేందర్ రెడ్డి – మహబూబ్ నగర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి – తాండూరు, బూర నర్సయ్య గౌడ్ – ఇబ్రహీం పట్నం, కూన శ్రీశైలం గౌడ్ – కుత్బుల్లాపూర్, గూడూరు నారాయణ – భువనగిరి, కోసం వెంకటేశ్వర్లు – ఆలేరు, ఈటల – హుజురాబాద్, బండి సంజయ్ – కరీం నగర్, బొడిగె శోభా – చొప్పదండి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు – వరంగల్ తూర్పు, చందుపట్ల కీర్తి రెడ్డి – భూపాలపల్లి, చెన్నమనేని వికాస్ రావు – వేములవాడ, రఘునందన్ రావు – దుబ్బాక, పాయల్ శంకర్ – ఆదిలాబాద్, సాయం బాపూరావు – బోథ్, మహేశ్వర్ రెడ్డి – నిర్మల్, ధర్మపురి అరవింద్ – ఆర్మూర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – మునుగోడు, సంకినేని వెంకటేశ్వర్లు – సూర్యాపేట , ప్రేమేందర్ రెడ్డి – పరకాల , శ్రీధర్ – వర్ధన్న పేట, హుస్సేన్ నాయక్ – మహబూబాబాద్, బాండ కార్తీక – సికింద్రాబాద్ , ప్రకాష్ రెడ్డి – నర్సం పేట, రాకేష్ రెడ్డి – వరంగల్ వెస్ట్ , విజయరామారావు – స్టేషన్ ఘన్ పూర్, శ్రీనివాస రెడ్డి – రాజేందర్ నగర్… ఇలా బీజేపీ మొత్తం 38 మంది అభ్యర్థులను ప్రకటించింది.