ఇవాళ తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో విడుదల

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన బీజేపీ.. ఇవాళ మేనిఫెస్టో విడుదల చేయనుంది. నేడు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్​లో క్షత్రియ హోటల్​ వేదికగా ఈరోజు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. కేసీఆర్ భరోసా, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు దీటుగా కమలదళం ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగులు, రైతులపై దృష్టి సారించినట్లు సమాచారం. పేదలకు లబ్ధి కలిగించే సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అదనంగా కొత్త అంశాలను చేర్చినట్లు తెలిసింది.

బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..

  • ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులు, రైతులకు లబ్ది కలిగేలా ఎన్నికల ప్రణాళిక
  • ప్రతి వ్యక్తికీ బీమా పథకం ప్రకటించే యోచనలో కమలదళం
  • నగరాల పేర్ల మార్పు అంశం మేనిఫెస్టోలో ఉండే అవకాశం
  • వరికి మద్దతు ధర రూ. 3,100కు పెంచే అవకాశం
  • ఆయుష్మాన్‌ భారత్‌ పరిమితి రూ. 10 లక్షలకు పెంచే యోచన
  • పెళ్లైన ప్రతి మహిళకు ఏటా రూ. 12 వేల ఆర్థిక సాయం
  • రూ. 500లకే గ్యాస్ సిలిండర్‌ ఇచ్చేలా హామీ
  • ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్లు, జన ఔషధి కేంద్రాల ఏర్పాటు
  • వ్యవసాయ కార్మికులకు ఏటా రూ. 20 వేల సాయం
  • యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ జాబ్‌ క్యాలెండర్‌
  • ఐఐటీ, ఎయిమ్స్‌ తరహాలో విద్యా సంస్థల ఏర్పాటు
  • పీఎం ఆవాస్‌ యోజన కింద అర్హులకు ఇళ్లు
  • చేతివృత్తుల వారికి ఉచిత విద్యుత్‌ అందించేలా హామీ
  • ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు
  • మహిళా సంఘాలు, రైతులకు వడ్డీ లేని రుణాలు

Read more RELATED
Recommended to you

Latest news