తెలంగాణ కేబినెట్ కులగణన, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. మూడు గ్రూపులుగా SC వర్గీకరణ చేశారని సమాచారం. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. రెండున్నర గంటలపాటు సాగిన మీటింగ్.. కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక మరి కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ రోజు దేశం చరిత్రలో నిలిచిపోతుందని… ఈ నిర్ణయంతో ప్రధాని పై ఒత్తిడి పెరగనుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలని డిమాండ్ రానుందని… 76 బీసీ, ఎస్సీ మైనార్టీలకు న్యాయం జరగనుందని వివరించారు. భవిషత్ లో ఈ రోజు మేము ప్రవేశపెట్టే డాక్యుమెంట్ రిఫరెన్స్ తీసుకోవాలని తెలిపారు. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ మేమే చేశామని… 2014 లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలని ఆగ్రహించారు.
- మూడు గ్రూపులుగా SC వర్గీకరణ
- ABC గా విభజన
- A గ్రూప్ – ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలు సంచార కులాలు- 1%
- B గ్రూప్ – మాదిగ మాదిగ ఉప కులాలు – 9%
- C గ్రూప్ –మాల మాల ఉపకులాలు -5%