బీరు తయారీ పరిశ్రమతో సీఎం రేవంత్ భారీ డీలింగ్ జరుపుతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద బీరు తయారీ పరిశ్రమ ఎబి.ఐన్.బెవ్ యాజమాన్య ప్రతినిధితో దావోస్‌లో భేటీ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 150 దేశాల్లో సుమారు 630 బీరు బ్రాండ్లు తయారు చేసే ఏబి.ఇన్.బెవ్ కంపెనీతో భేటీ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో ఏబి.ఇన్.బెవ్‌తో పెట్టుబడుల గురించి చర్చ జరిగినట్టు సమాచారం అందుతోంది.
ఇక అటు దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి 3వ రోజు పర్యటన కొనసాగుతోంది. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదాని, JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్ సహా పలువురితో భేటీ అయిన సీఎం…. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.