పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ | CM రేవంత్ రెడ్డి

-

పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ చర్చల్లో భాగంగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసారు. తెలంగాణ రాజధానిలోని పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు అని ఒరిజినల్ సిటీ అని తెలిపారు. జైపాల్ రెడ్డి కేంద్ర అర్బన్ డెవలప్ మెంట్ మంత్రిగా వయబుల్ గ్యాప్ ఫండ్ తీసుకువచ్చి హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కృషి చేశారు అని CM రేవంత్ రెడ్డి తెలిపారు.

అయితే గడిచిన పదేళ్ల బీఆరెస్ పాలనలో ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ అందుబాటులోకి తీసుకురాలేదు… కానీ మేం అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీ మెట్రోకు శంఖుస్థాపన చేశాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. రెండో దశలో 78 కి.మీ మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక సమర్పించాం. నాలుగేళ్లలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత మాది అని అసెంబ్లీ లో క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news