తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు

-

కంచుకోట లాంటి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి మరీ దిగజారుతూ వస్తుంది…ఇప్పటికే బలమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడటం పెద్ద మైనస్ అయిపోయింది. అక్కడ కోమటిరెడ్డి తర్వాత…అంతటి స్థాయిలో బలమైన నేత కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. అయితే కోమటిరెడ్డి పార్టీని వీడిన సరే మునుగోడులో కాంగ్రెస్ ని నిలబెట్టాలని రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ సభ పెట్టి…కాంగ్రెస్ శ్రేణులని కోమటిరెడ్డితో పాటు వెళ్లకుండా కాస్త బ్రేక్ వేశారు.

మునుగోడు ఉప ఎన్నికకు  అభ్యర్థిని ఖరారు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. ఢిల్లీకి రావాలని 8 మందికి సమాచారం పంపింది హై కమాండ్. ఈ 8 మందికి నేరుగా ఫోన్ చేసి హై కమాండ్ ఆదేశాన్ని వివరించారు మాణిక్యం ఠాకూర్. మునుగోడు అభ్యర్థి, ఉప ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.

ఈ సమావేశంలో ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్, మాణిక్యం ఠాకూర్ రాష్ట్ర నేతలతో విహరచన చేయనున్నారు. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి పెట్టినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version