కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చేతి వృత్తిదారులకు ఉచిత కరెంటు!

-

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓవైపు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తూ.. మరోవైపు ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇంకోవైపు మేనిఫెస్టో​పై ఫోకస్ పెడుతోంది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అన్ని వర్గాల వారికి లబ్ది చేకూరేలా రూపొందిస్తోంది.

ముఖ్యంగా చేతి వృత్తిదారులకు ఉచిత కరెంటు, వక్ఫ్‌బోర్డు ఆస్తులను జ్యుడిషియల్‌ పరిధిలోకి తెచ్చే హామీలను కాంగ్రెస్‌ పరిశీలిస్తోంది. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అధ్యక్షతన సభ్యులు సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది… తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కమిటీకి ఆయా సంఘాల ప్రతినిధులు వినతిపత్రాలు సమర్పించారు.

రాష్ట్రంలో వక్ఫ్‌భూములు 75 వేల ఎకరాలుంటే అందులో 68 వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని, మిగిలిన భూములను జ్యుడిషియల్‌ పరిధిలోకి తీసుకురావాలని వక్ఫ్‌బోర్డు ప్రతినిధులు కోరారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని పలువురు అభ్యర్థులు, తమకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని హార్టికల్చర్‌ విద్యార్థులు విన్నవించారు.

Read more RELATED
Recommended to you

Latest news