80కి పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్

-

కాంగ్రెస్ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఓ వైపు సభలు.. ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తోంది. మరోవైపు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తోంది. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్.. గెలుపు గుర్రాల ఎంపికపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ దాదాపుగా ఈ ఎంపికను ఓ కొలిక్కి తెచ్చింది.

మొత్తంగా 80కు పైగా స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఒకే అభ్యర్థి ఉన్న స్థానాలతోపాటు ఇద్దరు చొప్పున పోటీలో ఉన్న చాలా నియోజకవర్గాల్లో దరఖాస్తులను వడపోసి జాబితాను రూపొందించినట్లు తెలిసింది. ఎంపిక చేసిన జాబితాను ఇవాళ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని నిర్ణయించారు. అక్కడ అనుమతి లభించిన తర్వాత… ఈ నెలాఖరుకు లేదా అక్టోబరు మొదటి వారంలో 80కిపైగా స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎస్టీ, ఎస్సీలతోపాటు బీసీల్లోనూ సామాజిక సమతౌల్యం పాటించాలని ప్రయత్నిస్తుండడంతో సుమారు 20 స్థానాల విషయంలో స్క్రీనింగ్‌ కమిటీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news