తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికే పార్టీ కీలక నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికి చేర్చుతున్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రచారం నిర్వహించేందుకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్లు జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి AICC నివేదించింది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలతోపాటు రాష్ట్ర నాయకులను కూడా భాగస్వామ్యం చేశారు. ఇందులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక్ గాంధీ, కేసీ వేణు గోపాల్ ప్రచారంలో పాల్గొంటారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఛత్తీస్గఢ్ సీఎం భూసేష్ సింగ్ బగేల్, కర్టాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు అవకాశం కల్పించారు. ఆ తరువాత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సల్మాన్ కుర్షీద్, జీవన్ రెడ్డి, జయరాం రమేష్, దీపాదాస్ మున్సీ, రేణుక చౌదరి సహా ఇతర నేతలు ఉన్నారు.