తెలంగాణ రాష్ట్రంలో కరెంటు చార్జీల పెంపు ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో ఇంటి కరెంటు మీటర్ పై 50 రూపాయల వరకు… చార్జీలు పెంచబోతున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కరెంటు చార్జీల పెంపుపై… డిస్కం సిఎండి ముషారఫ్ కీలక ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులపై కరెంటు చార్జీలు అసలు పెంచబోమని ఆయన వెల్లడించారు.
హై టెన్షన్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై కూడా చార్జీల భారం అసలు ఉండదని వివరించారు ముసారఫ్. నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగదారులకు ఫిక్స్డ్ చార్జీల రూపంలో 50 రూపాయల పెంపు కోసం ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వివరించడం జరిగింది. కానీ సామాన్యులకు మాత్రం కరెంటు బిల్లులు పెంచడం లేదని వివరించారు. కానీ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగాబోతున్నాయని… జరుగుతున్న ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదని ముషారఫ్ తెలిపారు.