రేపు తెలంగాణ వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి అని ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ పగడాల తాళి ప్రసాద్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ పిలుపుమేరకు 24 గంటల పాటు వైద్య సేవలను బహిష్కరిస్తున్నారు ఐఎంఏ వైద్యులు. మొత్తం 20 వేల మంది వైద్యులు, ఐఎంఏ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు.. ప్రభుత్వ వైద్యులు కలిస్తే 60 వేల మంది వైద్యులు ఇందులో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2000 ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. మొట్టమొదటి సారి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు కూడా ఈ నిరసనలో పాల్గొననున్నారు అని పగడాల తాళి ప్రసాద్ తెలిపారు.
ఆగస్టు 9 వెస్ట్ బెంగాల్ లో మహిళ డాక్టర్ పై జరిగిన ఘటన కు నిరసనగా రేపు ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నం. ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు వైద్యులం అందరం కలిసి బంద్ పాటిస్తున్నం. డాక్టర్స్, నర్సింగ్ హోమ్స్, డెంటల్ క్లినిక్స్, డయాగ్నస్టిక్ సెంటర్స్ బంద్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరగకూడదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. కఠినమైన చర్యలు తీసుకురావాలి అని పగడాల తాళి ప్రసాద్ అన్నారు.