మే 7 నుంచి ఈఏపీసెట్‌ పరీక్షలు

-

ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే విద్యార్థుల కోసం నిర్వహించే ఈఏపీసెట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు వీటిని నిర్వహించనున్నారు. సెట్ నిర్వహణ బాధ్యతలు ఉన్నత విద్యామండలి జేఎన్టీయూకు అప్పగించింది.

ఈ ఏడాది EAP సెట్ కి మొత్తం 3లక్షల 54వేల 803 దరఖాస్తులు రాగా అందులో ఒక్క ఇంజినీరింగ్ కోసమే 2లక్షల 54వేల 543 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2లక్షల 5వేల 472 మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారు. మరో 49వేల 71 మంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు. తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 21 జోన్లలో పరీక్ష నిర్వహించనుండగా.. 16 తెలంగాణలో, 5 ఏపీలో ఉండనున్నాయి. హైదరాబాద్ను నాలుగు జోన్లుగా చేసిన జేెన్టీయూహెచ్…64 కేంద్రాల్లో ఫార్మా, అగ్రికల్చర్ పరీక్షను , 81 కేంద్రాల్లో ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ నిర్వహించనుంది. ఏపీలో కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరుల్లో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది.

ఇంజినీరింగ్ కి దరఖాస్తు చేసుకున్న వారిలో లక్షా 3వేల 862 మంది విద్యార్థినులు, లక్షా 50వేల 600 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షా కేంద్రాలలోనికి ఎలక్ట్రానికి గ్యాడ్జెట్లు, నీళ్ల సీసాలు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఇందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news