తెలంగాణ రైతులపై రుణభారం రూ.1,12,492 కోట్లు

-

తెలంగాణ రైతులు ఇప్పటికే చాలా వరకు అప్పుల భారంతో కుంగిపోతున్నారు. ఓవైపు అనావృష్టి.. మరోవైపు అకాల వర్షాలు.. ఇంకోవైపు చీడపీడలు.. ఇలా రకరకాల విపత్తులతో రైతులు పంట నష్టపోతున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులపై ప్రస్తుతం రూ.1,12,492.31 కోట్ల వ్యవసాయ రుణభారం (తలసరి రూ.1,52,665) ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భాగవత్‌ కరాడ్‌ తెలిపారు.

సోమవారం రోజున రాజ్యసభలో సభ్యుడు హనుమాన్‌ బేనీవాల్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తెలంగాణలో 73,68,528 ఖాతాల ద్వారా రైతులు రుణాలు తీసుకున్నారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భాగవత్‌ కరాడ్‌  తెలిపారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో 1,51,39,571 ఖాతాల ద్వారా అక్కడి రైతులు రూ.1,71,510.92 కోట్ల రుణాలు తీసుకోగా.. ఏపీ రైతులపై అంతకంటే 41.72% అప్పుల భారముందని వెల్లడించారు.

మరోవైపు.. తెలంగాణలో గత అయిదు నెలల్లో 4,07,758 పిడుగులు పడినట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్‌ చౌబే తెలిపారు. 2019-21 మధ్య మూడేళ్ల కాలంలో పిడుగుల కారణంగా 226 మంది కన్నుమూసినట్లు కేంద్ర మంత్రి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news