ఆర్టీసీ బిల్లులో గవర్నర్‌ అభ్యంతరాలకు ప్రభుత్వం వివరణ

-

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ.. వాటికి వివరణ ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ మేరకు రాజ్‌భవన్‌కు వివరణను పంపించింది.

తెలంగాణ‌లోని ఆర్టీసీ కార్మికుల‌ను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామ‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత‌న ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు రూపొందించింది. ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలనుకుంది. దాని కోసం గవర్నర్​కు బిల్లును పంపింది.

కానీ గవర్నర్ ఈ బిల్లుపై ఐదు రకాల ప్రశ్నలు లేవనెత్తారు. వాటికి వివరణ ఇచ్చిన తర్వాత ఆమోదం తెలపాలా వద్దా అనేది నిర్ణయిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ తాజాగా గవర్నర్​కు వివరణ ఇచ్చింది. మరోవైపు గవర్నర్ వెంటనే ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ముట్టడించేందుకు బయల్దేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే గవర్నర్ తమిళిసై టీఎంయూ నాయకులతో మాట్లాడాలని వారిని రాజ్ భవన్​కు ఆహ్వానించారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న తమిళిసై ఆర్టీసీ యూనియన్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news