హైడ్రా లో 169 పోస్టులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..!

-

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో చెరువుఅను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా, అక్రమ నిర్మాణాలను, ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా తీసుకొచ్చింది. ఇటీవలే తీసుకొచ్చిన హైడ్రా తో కబ్జాదారుల గుండెల్లో ధడా పుట్టిస్తోంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతూ.. బారీ కట్టడాలను సైతం గంటల వ్యవధిలోనే నేలమట్టం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

కొద్ది రోజుల వ్యవధిలోనే ఇంతటి పేరు తెచ్చుకున్న హైడ్రా లో కొత్తగా 169 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులను వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించేందుకు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులలో నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 16 మంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లను హైడ్రాకు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version