కాంగ్రెస్ చేతిలో పడితే హర్యానా నాశనమే : ప్రధాని మోడీ

-

హర్యానాలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ  విమర్శించారు. బుధవారం సోనిపట్ జిల్లాలోని గోహనాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే.. హర్యానా సుస్థిరత, అభివృద్ధిని పణంగా పెట్టడమేనని ఆరోపించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ ఆశలు సన్నగిల్లుతున్నాయని తెలిపారు. 

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులు, అణగారిన వర్గాల హక్కులను లాక్కుందని ఫైర్ అయ్యారు. హర్యానాలో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు కారణంగా అభివృద్ధి ప్రమాదంలో పడుతుందన్నారు. హర్యానా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రధాని మోడీ. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ దేశ ఆడబిడ్డల గురించి ఏనాడు ఆలోచించలేదన్నారు. బీజేపీ హయాంలో భేటీ బచావో-భేటీ పడావో ప్రచారాన్ని ప్రారంభించగా.. హర్యానాకు ఎంతో ప్రయోజనం చేకూరిందని తెలిపారు. హర్యానాలో బీజేపీకి మద్దతు పెరుగుతుందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. 

Read more RELATED
Recommended to you

Exit mobile version