నేడు ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్‌ విందు

-

రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ విందును ఏర్పాటు చేయనుంది. విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ మాసంలో ముస్లింల కోసం సామూహిక విందు ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. విందులో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

గురువారం రోజున ఈ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. వేలాదిమంది ఇందులో పాల్గొనే అవకాశం ఉండడంతో అందరికీ ఆహారం, మంచి నీరు, కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఇందులో పాల్గొనే నాయకులు అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అందరూ ఒకే చోట గుమిగూడ కుండా ఆహారం అందించేందుకు తగినన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వీఐపీలు వచ్చే మార్గం ,పార్కింగ్, భద్రతపరమైన అంశాలు వాటిని ఆయన సమీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news