త్వరలోనే మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణ

-

తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే గత సర్కార్ హయాంలో చాలా పథకాల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై దర్యాప్తున చేయిస్తోంది. ఇప్పటికే ధరణి పోర్టల్ పై కమిటీ నియమించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మిషన్ భగీరథ పథకం పనులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ఈ విషయమై దర్యాప్తు సంస్థ అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే చర్చించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసి మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని సర్కారు భావిస్తోంది. సుమారు రూ.ఆరేడు వేల కోట్ల విలువైన పనుల్లో అవకతవకలు జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ విచారణ జరిపించాలనే నిర్ణయానికి సర్కారు వచ్చినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news