AP Budget 2024 : ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంచనా 2.85 లక్షల కోట్లు !

-

AP Budget 2024: ఇవాళ మూడో రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ ఉదయం 11 గంటల 3 నిమిషాలకు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంచనా 2.85 లక్షల కోట్లు ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీనిలో మూడు నెలల కాలానికి సంబంధించిన వ్యయ ప్రతిపాదనలతో ఓట్ ఆన్ అకౌంట్ ఉంటుందట.

మూడు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పని చేస్తుంది. అలాగే, ఇవాళ్టి అసెంబ్లీ సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఆర్జేయుకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్స్ అండ్ పే స్ట్రక్చర్ సవరణ బిల్లు)మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం.

 

Read more RELATED
Recommended to you

Latest news