హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దు.. మరోసారి హైకోర్టు ఆదేశం

-

హైదరాబాద్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అప్పుడే నిమజ్జన ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలోనే హుస్సేన్‌ సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దని తెలంగాణ హైకోర్టు మరోసారి గట్టిగా చెప్పింది. కృత్రిమ కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని ఆదేశించింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సూచించింది. జలాశయాల్లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయనీయవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమలు చేసి నివేదిక సమర్పించాలని పేర్కొంది.

ట్యాంక్‌బండ్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జం చేయకూడదని గతంలోనే హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఈ విగ్రహాలతో సాగర్ కలుషితమవుతోందని పలువురు పిటిషన్లు వేయడంతో హైకోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. అయితే వినాయక నిమజ్జన ప్రక్రియ హైదరాబాద్‌లో ఇప్పటికే షురూ అయింది. మరోవైపు పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదన్న విషయం ఉన్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పీవోపీ విగ్రహాల నిమజ్జం హుస్సేన్ సాగర్‌లో చేయొద్దంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పునరుద్ఘాటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version