ఢిల్లీకి ఉన్నత విద్యామండలి ఛైర్మన్.. అనుమతి లేని సెంటర్స్ పై..!

-

ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ అక్కడ UGC చైర్మన్, aicte చైర్మన్, బార్ కౌన్సిల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. వారికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్. లింబాంద్రి, సెక్రెటరీ శ్రీరాం వెంకటేష్, UGC చైర్ పర్సన్ జగధీష్ కుమార్ కలసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య అభివృద్ది గురించి వివరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిద యునివర్సిటీలు, కళాశాలలు వాటి ఎన్రోల్ మెంట్ విషయలపై వివరణ ఇచ్చారు. అలాగే అడ్మిషన్ ప్రక్రియలో జరుగుతున్నటువంటి అనేక అంశాలను కూడ చర్చించారు.

అయితే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువుంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ , ఓపెన్ యునివర్సిటి స్టడి సెంటర్స్ ను అనుమతి లేకున్నా ఏర్పాటు చేశాయి. అందులో విద్యార్థులకు జాయిన్ అవుతున్నారు. కానీ ఆ సెంటర్ లు ఇచ్చే సర్టిఫికేట్లకు గుర్తింపు లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇష్యూ పై దృష్టి పెట్టాలని కోరారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాంద్రి. అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సంబందిత అధికారులను కలిసి తెలంగాణలో ఇప్పటికీ అప్రూవల్ పెండింగ్ వున్న లా కళాశాలల గురించి వివరించడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే అప్రూవల్ ఇవ్వడానికి అంగీకరించారు అని లింబాంద్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version