తెలంగాణ చరిత్ర, స్పూర్తిని ప్రతీ ఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. వ్యక్తిగతంగా గౌరవించే నాయకుల్లో దేవేందర్ గౌడ్ ముందుంటారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తాను ముఖ్యఅతిథిగా రావడం రాజకీయ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం అన్నారు. వివిధ సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థుల గురించి తెలియాలి అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంలో పాల్గొన్న అంశాలను క్రోడీకరిస్తే బాగుంటుంది. పెద్దలు దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తకంలో కనిపిస్తాయనుకుంటున్నాను. వారు ఉన్న పార్టీలో నాయకుడితో పాటు సమానంగా ఆయన పొందారు. తెలంగాణ చరిత్రకు లండన్ తరహా మ్యూజియం రావాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్క వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ తెలంగాణ కాదు అన్నారు. గోదావరి జలాల కోసం పాదయాత్ర చేశారు దేవెందర్ గౌడ్.