సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు, నకిలీ వార్తల వ్యాప్తి.. ఇలా చాలా నేరాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం ఇప్పుడు కలవరానికి గురి చేస్తున్న విషయం. 2022లో దేశవ్యాప్తంగా నమోదైన నేరాల వివరాలను తాజాగా జాతీయ నేరగణాంకాల సంస్థ ఎన్‌సీఆర్‌బీ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికలో తెలంగాణలో చాలా మంది సైబర్ కేటుగాళ్ల మాయలో పడుతున్న తెలిపింది.
మహిళలపై నేరాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా.. నకిలీ వార్తల వ్యాప్తిలో మాత్రం దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. మరోవైపు సైబర్ నేరాలకు సంబంధించి 15,297 కేసులతో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ నిలిచింది. సైబర్ నేరాలకు సంబంధించి ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నా కేసులు సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
- బ్యాకింగ్‌లో 3,223 నేరాలు
- ఓటీపీ మోసాలు 2,179
- చీటింగ్‌లో 4,467
- లైంగిక వేధింపులు 152
- చోరీలకు సంబంధించి 15,854
- వాహనచోరీల కేసులు 6,650
- దోపిడీలి 520
- నమ్మకద్రోహం 595
- అక్రమ నిర్భంధం 1372
- అపహరణలు 2981
- పిల్లల అపహరణలు
- వరకట్న మరణాలు 137
- లైంగిక దాడి 470
- అత్యాచారం 814
- పోక్సో కేసులు 2752
- 700 కేసులు నమోదైనట్లు NCRB నివేదికలో పేర్కొంది.