ఏపీ నాయకుల వల్లే…బీఆర్ఎస్ ఓటమి…!

-

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటమికి దుష్ట నాయకులతో చెలిమే కారణమని తన భావన అని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఈ దుష్ట చెలిమిని వ్యతిరేకిస్తూ ప్రారంభంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు తీవ్రంగా పోరాటం చేశారని, ఆ తరువాత అవిశ్రాంతంగా ఆ పోరాటాన్ని రేవంత్ రెడ్డి గారు కొనసాగించారని అన్నారు. స్టార్టింగ్ లో సంజయ్ గారు గట్టిగా ఫైట్ చేశారనడంలో ఎటువంటి సందేహం లేదని, రేవంత్ రెడ్డి గారు కూడా అంతకంటే గట్టిగానే తన పోరాటాన్ని కొనసాగించారని, ఇప్పుడు అవన్నీ కలిసి వచ్చాయని అన్నారు.

దుష్ట స్నేహితుల పనికిమాలిన సలహాలతో అహంకారం అధికమైందన్న భావన ప్రజల్లో వ్యక్తం అయిందని, ఆంధ్ర రాష్ట్ర పాలకుల అహంకార పూరిత ఆలోచనల ప్రభావం తెలంగాణ పాలకులపై కూడా పడిందేమో తెలియదని అన్నారు. తెలంగాణలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని, ధరణి లోపాలు కొంత ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు కారణమైతే అయి ఉండవచ్చునని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చక్కటి కృషి చేశారని, కారణాలు ఏవైనా కానీ పాలకుల్లో కించిత్తు అహంకారం ఎక్కువైందని ప్రజలు భావించారని అన్నారు.

ముఖ్యమంత్రి అజ్ఞాని అయిన కూడా ప్రజలు మన్నిస్తారు కానీ అహంకారి అయితే అసలు మన్నించలేరని అన్నారు. అజ్ఞానంతో కూడిన అహంకారం అధికమైతే ప్రజలు అసలు సహించరని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్నది అదేనని, రానున్న ఎన్నికల్లో ప్రస్తుతం పాలకులు చాలా దారుణంగా ఓడిపోతారని చెప్పడానికి తాను వెనుకాడనని అన్నారు. తెలంగాణలో ప్రజలు ఎన్నికల ఫలితాలు చూశాక అంతానికి ఆరంభం అయ్యిందని ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news