ఎల్లుండి నుంచే తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 19 వరకు ఇంటర్ పరీక్షలు ఉండనున్నట్లు ప్రకటన చేశారు ఇంటర్ బోర్డు సెక్రెటరీ శ్రుతి ఓజా. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని… 1521 ఎగ్జామ్ సెంటర్ లు, 27 వేల 900 మంది ఇన్విజిలేటర్ లు ఉంటారని ఇంటర్ బోర్డు సెక్రెటరీ శ్రుతి ఓజా వెల్లడించారు. ఇంటర్ లో మొత్తం 9 లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని వివరించారు.
4 లక్షల 78వేల 718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు, 5 లక్షల 02వేల 260 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కు హాజరు అవుతున్నారని చెప్పారు. పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులతో సమన్వయం తో ఎగ్జామ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసామన్నారు ఇంటర్ బోర్డు సెక్రెటరీ శ్రుతి ఓజా. 9 గంటల తరవాత పరీక్ష హాల్ లోకి అనుమతి ఉండదని….పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర హెల్త్ క్యాంప్ ఉంటుందని… ఎగ్జామ్ టైమింగ్ లను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.