తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కొన్ని లక్షల మంది విద్యార్థులు రిజల్ట్ కొరకు ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్ రావడంతో మన తెలంగాణ విద్యార్థులు కూడా రిజల్ట్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలు మూల్యాంకన అయిపోయినట్టు తెలుస్తుంది.

తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మార్చి 5 నుండి మార్చి 25 వరకు జరిగినది మనందరికీ తెలిసినదే. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ రావడంతో మన తెలంగాణ విద్యార్థులు రిజల్ట్ ఎప్పుడని చూస్తున్నారు. రిజల్ట్ లో ఎలాంటి పొరపాటు లేకుండా అధికారులు చూసుకుంటున్నారు. విద్యార్థుల ప్రశ్నాపత్రాలలో జీరో మార్కులు వచ్చిన వారికి వెరిఫైకేషన్ చేస్తానన్నారు. ఏప్రిల్ 27న ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయన్నారు.