ఉస్మానియా వైద్యులకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ‘నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు’..అన్న నానుడిని ఉస్మానియా వైద్యులు తిరగరాశారని ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని ప్రూవ్ చేశారన్నారు. ఇటీవల షిర్డీకి వెళ్తున్న ఏపీకి చెందిన 22 ఏళ్ల యువకుడు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. అతన్ని అడ్మిట్ చేసుకునేందుకు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిరాకరించగా.. అతడి కుటుంబ సభ్యులు వెంటనే ఉస్మానియాకు తరలించారు.
అక్కడి వైద్యులు యువకుడిని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం అతను కోలుకున్నాడు. దీనికి సంబంధించిన కథనం ఓ దినపత్రికలో రావడంతో జపాన్‌లో టూర్‌లో ఉన్న సీఎం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఉస్మానియా వైద్యులు డాక్టర్ రంగా అజ్మీరా,డాక్టర్ విక్రమ్ బృందం ఆదర్శంగా నిలిచారని అభినందించారు.