తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారు.
ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరిగిన ఇంటర్ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు రాశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్ట్, సెంకడ్ ఇయర్ రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in లేదా www.manabadi.com వైబ్సైట్లోకి వెళ్లి తెలంగాణ ఇంటర్ రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి ఎంతో పకడ్బందీగా పరీక్షలను అధికారులు నిర్వహించారు. మార్చి 10 నుంచి మూల్యాంకనం ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో ఈ ప్రక్రియను నిర్వహించిన అధికారులు ఏప్రిల్ 10వ తేదీన మూల్యాంకనం పూర్తి చేశారు. మార్కుల నమోదుతోపాటు ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.