తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని.. వాటిని అమలు చేస్తుందని పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని.. కొన్ని పథకాల కోసం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు, మంత్రులు తెలంగాణకి వచ్చేసి వాటి గురించి తెలుసుకొని వెళ్తున్నారని గుర్తు చేశారు. మరోవైపు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ కోతలపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరెంట్ లేక వైర్లపై బట్టలు ఆరేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కరెంట్ ఉండదన్నారన్న మంత్రి ఎర్రబెల్లి ఇప్పుడు ఏపీలోనే కరెంట్ లేదని ఆయన విమర్శించారు.కానీ తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.అనంతరం భూముల రేట్లపై కూడా స్పందించిన ఆయన ఏపీలో భూముల ధరలు పడిపోయాయని చెప్పారు.ఈ క్రమంలోనే తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో వంద ఎకరాలు వస్తోందని వెల్లడించారు.