నేడు సియోల్ లో మూడో రోజు పర్యటించనుంది. తెలంగాణ మంత్రుల, అధికార బృందం. ఇవాళ సియోల్ లో AI సిటీని సందర్శించనుంది బృందం. ప్యూచర్ సిటీ లో ఏర్పాటు చేయనున్న AI సిటీ పై సెమినార్ లో పాల్గొననున్నారను. అనంతరం స్మార్ట్ సిటీ పై కాన్పరెన్స్ లో పాల్గొననున్నారు. సాయంత్రం ఇండియన్ అంబాసిడర్ తో సమావేశం కానున్నారు. కొరియా లో అత్యంత ప్రతిష్ఠాత్మక స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో ఒకటి గా ఇంచాన్ స్మార్ట్ సిటీ ఉంది. కొరియాలోని సాంగ్డో ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఇంచాన్ స్మార్ట్ సిటీ కావడం గమనార్హం.
1,500 ఎకరాలల్లో పర్యావరణ అనుకూల విధానాలతో ఇంచన్ స్మార్ట్ సిటీ ఏర్పాటు అయింది. దక్షిణ కొరియా లో సూపర్-స్మార్ట్ నగరంగా మారిన సాంగ్దో నగరంలోని ఇంచన్ స్మార్ట్ సిటీ ఉంది. అత్యాధునిక సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) వినియోగంలో ఉంది. స్మార్ట్ సిటీలోనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) సిటీ. సాంగ్డో సిటీ మొత్తాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా కనెక్ట్ చేయడం లక్ష్యంగా IoT ప్రాజెక్ట్ ఉంది. IoT ఆధారంగా నడుస్తున్న నివాస గృహాలు, కార్యాలయాలు, రవాణా వ్యవస్థలు, పార్కులు, మరియు షాపింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇళ్లలో టెంపరేచర్, సెక్యూరిటీ, విద్యుత్ వినియోగం వంటి అన్ని అంశాలను స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఆపరేషన్ ఉంటుంది.