ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్ వాడుతున్న తెలంగాణ మంత్రులు?

-

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి… చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా హెలికాప్టర్ వాడుతున్నారు. ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఎమ్మెల్యేల పుట్టినరోజు వేడుకలకు కూడా… ప్రత్యేక హెలికాప్టర్లను వాడుతున్నారట తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Telangana ministers using helicopters for MLAs’ birthdays

ఆయన వెళ్లడమే కాకుండా.. కాంగ్రెస్ నేతలను కూడా తన వెంట తీసుకువెళ్తున్నారట. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని… కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఫైర్ అవుతున్నారు జనాలు. తాండూర్ ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి.. పుట్టినరోజు వేడుకలకు.. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరు అయ్యారు. వీరితో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత మరియు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version